VIDEO: బస్సు ప్రమాద మృతుల కుటుంబాన్ని కలిసిన కేటీఆర్
HYD: సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. విద్యానగర్ లో నసీరుద్దీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.