'అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలి'
NRPT: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ TG ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి మంజూరు చేయవలసిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఇవాళ నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.