వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర

వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర

MBNR: కోయిలకొండ మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్, ప్రజాప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి శోభాయాత్రను ప్రారంభించారు. వివిధ సంఘాల యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 'జై శ్రీరామ్' నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో స్వామివారిని అలంకరించి ఊరేగించారు.