సురుచి ఫుడ్స్‌లో వినాయక చవితి ఉత్సవాలు

కోనసీమ: తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఆవరణలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఐదుగురు మేస్త్రీలతో గణేష్ మాలధారణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో మంగళవారం ప్రారంభమైంది. ఈ ఐదుగురు మేస్త్రీలు స్వయంగా వినాయక లడ్డూలను తయారు చేయడం గత సుదీర్ఘ సంప్రదాయంగా కొనసాగుతోంది. కస్టమర్లకు నాణ్యత, పవిత్రత, భక్తి ప్రధాన లక్ష్యంగా లడ్డూలను అందించడం ఈ సంప్రదాయం విశిష్టతగా నిలుస్తోంది.