ధర్మవరంలో ఉచిత యోగా శిక్షణ
సత్యసాయి: ధర్మవరంలో 14 ఏళ్లలోపు విద్యార్థుల కోసం మే 1 నుంచి 31 వరకు ఉచిత యోగా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సాంస్కృతిక మండలి, మున్సిపల్ పాఠశాల, యశోద కిడ్స్ పాఠశాలల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్లు అందజేస్తామని వెల్లడించారు.