నిరుపేద కుటుంబానికి కుట్టు మిషన్ అందజేత

HNK: అయినవోలు మండలం వనమల కనపర్తి గ్రామానికి చెందిన గట్టు సునీత కుటుంబానికి నేడు కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సభ్యులు ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఇటీవల సునీత భర్త రాజేష్ తాటి చెట్టుపై నుంచి పడి మృతి చెందారు. పేద కుటుంబం కావడంతో అసోసియేషన్ సభ్యులు కుట్టు మిషన్ అందజేశారు.