ప్రారంభమైన రెండో విడత కౌంటింగ్
WGL: జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. దీంతో ఇవాళ రాత్రి వరకు గ్రామ నూతన సర్పంచ్, వార్డు మెంబర్ తుది ఫలితాలతో ప్రకటించే అవకాశం ఉంది.