రహదారి నిర్మించాలని వినతి

విశాఖ: చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయితీ చిన్న వీధిలో రహదారి నిర్మాణం చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఇటీవల రహదారి మంజూరైందని, నిర్మాణ పనులు మొదలుపెట్టి అర్థాంతరంగా నిలిపివేయడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అంబులెన్స్ సేవలు పొందేందుకు సహకరించాలని కోరారు.