VIDEO: నారాయణ తిరుమలలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

SKLM: శ్రీకాకుళం పట్టణం గుజరాతిపేట పిఎన్ కాలనీలో తిరుమల కొండపై వెలసిన నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పుష్కరిణి అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శుక్రవారం ఉదయం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా పుష్కరిణి చుట్టూ మహావిష్ణువుని వివిధ అవతారాలతో విగ్రహాల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు.