లంకలో పర్యటించిన ఆర్టీవో దాసిరాజు

W.G: వశిష్ట గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరసాపురం ఆర్డీవో దాసి రాజు అన్నారు. గురువారం ఆచంట మండలం అయోధ్య లంక గ్రామంలో ఆయన పర్యటించారు. ఎగువ నుంచి వరద నీరు గోదావరిలోకి చేరుతుండడంతో మరో రెండు రోజులపాటు గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.