ఆర్థిక సాయం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు

MBNR: గుమ్మడం గ్రామానికి చెందిన హరిజన్ జమన్న అకాల మరణం చెందిన విషయాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఆయన గ్రామ బీఆర్ఎస్ కమిటీ ద్వార ఆ కుటుంబానికి 5 వేల రూపాయలు హార్దిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కావాలి చెన్నయ్య, మాజీ సర్పంచ్ బాలస్వామి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.