ఐపీఎల్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు: ఎస్సై

ఐపీఎల్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు: ఎస్సై

MDK: జిల్లాలో యువత ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని ఎస్సై నారాయణ గౌడ్ హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల డబ్బులు కోల్పోవడమే కాకుండా, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. బెట్టింగ్లపై పోలీసులు నిఘా ఉంచారని, క్రీడలను వినోదంగా చూడాలి తప్ప వ్యసనంగా మార్చుకోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.