వికారం, వాంతులు: అసలు కారణం ఇదేనా?
TG: ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల జీర్ణక్రియ మందగించి వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. తేమ కారణంగా ఆహారం, నీరు కలుషితమై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్ నివారణకు ORS, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఎప్పుడూ వేడి ఆహారం, కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి, నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.