రైలు దిగుతున్న వ్యక్తికి గాయాలు
MNCL: మంచిర్యాల రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం కదులుతున్న రైలు నుండి దిగడానికి ప్రయత్నించిన సత్యనారాయణ అనే రైతు కాలు ప్లాట్ ఫారంకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించగా, సిబ్బంది మధుకర్, రాజారామ్ ఘటనాస్థలికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.