ఇంటర్మీడియట్ పరీక్షకు 98.21% హాజరు
MDK: జిల్లాలో 6వ రోజు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. రెండవ సంవత్సర బోటనీ-II, పొలిటికల్ సైన్స్-II, మ్యాథ్స్ -IIA పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. పరీక్షలలో 98.21 శాతంగా జనరల్ విభాగంలో 5017 గాను 4932 విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 541గాను 527 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.