చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

AKP: నక్కపల్లి మండలం వేంపాడులో ఈనెల 8న కే.నాగేశ్వరరావు ఇంటిలో ఎవరు లేని సమయంలో తాళాలు పగల కొట్టి బంగారు ఆభరణాలు పట్టుకుపోయిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డీఎల్ పురంకు చెందిన జీ.అప్పారావును పట్టుకుని అతని వద్ద నుంచి 53.74 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 72000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.