కాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ

కాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ

 KKD: వాయవ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న అల్పపీడనం రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగనున్నాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో గురువారం మూడో స్థాయి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు, మౌసమా ప్రభావితులు అప్రమత్తంగా ఉండాలని సూచన.