చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని బాబూజీ కాలనీలో పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం టూ టౌన్ SI రాజమోహన్ రావు ప్రజలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా గంజాయి ఇతర మాదకద్రవ్యాలకు బానిసలు కాకూడదని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు.