నల్ల రాయి క్వారీ పై చర్యలు తీసుకోవాలని వినతి

నల్ల రాయి క్వారీ పై చర్యలు తీసుకోవాలని వినతి

AKP: రోలుగుంట మండలం శరభవరం పంచాయతీ రాజన్నపేటలో నల్లరాయి క్వారీలో బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు బీటలు వారుతున్నాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు సోమవారం నర్సీపట్నం ఆర్డీవోకు రమణకు పిర్యాదు చేశారు. నల్లరాయి క్వారీలో బ్లాస్టింగ్ వల్ల గ్రామానికి చెందిన 30కి పైగా ఇల్లు బీటలు వారాయని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.