ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: ప్రజల ఆరోగ్యం, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ప్రభుత్వ వైద్య రంగంలో పలు సంస్కరణలు చేపట్టిందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం దామెర మండలం ఊరుగొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. వీటి ద్వారా ఆయా గ్రామాల్లోని ప్రజలకు మరింత మేలు కలుగుతుందని అన్నారు