వంరగల్‌లో 137 డ్రంక్ &డ్రైవ్ కేసులు నమోదు
WGL: మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 137 కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ విభాగంలో 78, సెంట్రల్ జోన్‌లో 28, వెస్ట్ జోన్‌లో 17, ఈస్ట్ జోన్‌లో 14 కేసులు నమోదు అయ్యాయి.