VIDEO: నగరంలో ఇక నుంచి వీడియో, ఫొటో తీస్తే పైసల్..!
HYD: నగరంలోని గల్లీ రోడ్లపై నీరు వృధా చేయడం చూస్తుంటాం. అయితే.. నీటి వృధాపై జలమండలి ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేదు. దీంతో కీలకం నిర్ణయం తీసుకుని, అడుగులు ముందుకు వేస్తుంది. ఇక మీరే 'వాటర్ పోలీస్' కావొచ్చు. నీటిని వృథా చేసే వారి వీడియో, ఫొటో పంపిస్తే వారిపై జరిమానా, మీకు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు.