పేదలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు: ఎమ్మెల్యే
W.G: పేద ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈరోజు తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కీళ్లు, వెన్నెముక వ్యాధుల ఓపి విభాగాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఇందుకోసం తణుకులోని ప్రైవేటు వైద్యుల సహకారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.