గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసమే ప్రేరణ: ఎస్పీ
SRD: గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసమే ప్రేరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. కందిలోని ఐఐటీలో ఆదివారం ఐఐటి రూరల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రేరణ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. చిన్నతనం నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని పేర్కొన్నారు.