విశ్రాంత ఉద్యోగుల సభ్యత్వ సేకరణ

SRD: కొండాపూర్ మండలం మారేపల్లి, అనంతసాగర్ గ్రామాల్లో విశ్రాంత ఉద్యోగుల సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లా పబ్లిసిటీ కార్యదర్శి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామచంద్రయ్య, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, సంయుక్త కార్యదర్శి అనంతరాములు పాల్గొన్నారు.