'శాంతి భద్రతలు పటిష్టం చేయాలి'
SKLM: పలాస–కాశీబుగ్గ పట్టణ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన CI రామకృష్ణను పలాస పట్టణ అధ్యక్షుడు నాగరాజు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలాసలో శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేయాలని నాగరాజు సీఐను కోరారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పని చేస్తామని సీఐ హామీ ఇచ్చారు.