ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్

ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్

MDK: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి'లో కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్ల పరిష్కారం కోరుతూ బాధితులు దరఖాస్తులు సమర్పించారు. సాధ్యమైన వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.