బయటపడ్డ 70 పురాతన నాణేలు

బయటపడ్డ 70 పురాతన నాణేలు

TG: పొలం చదును చేస్తుండగా 70 పురాతన నాణేలు బయటపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజీ కొత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. నాణేల పంపకాల విషయంలో ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ నాణేలు 14వ శతాబ్దానికి చెందిన బహుమనీ సుల్తానుల కాలానికి చెందినవిగా గుర్తించారు.