VIDEO: BC కళాశాల విద్యార్థుల సందర్శించిన కలెక్టర్
WNP: జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రభుత్వ బీసీ కళాశాల విద్యార్థుల సంక్షేమ హాస్టల్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూను ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు.