VIDEO: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన
RR: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోల్‌కత్తా వెళ్లాల్సిన విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో ఈ ఉద్రిక్తత నెలకొంది. తమ గమ్యస్థానాలకు చేరాల్సిన సమయంలో విమానం రద్దుపై సమాచారం లేకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.