గుత్తి కోట ఉత్సవాలకు సర్వం సిద్ధం చేయండి: జేసీ
ATP: ఈనెల 14, 15 తేదీలలో నిర్వహించే గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని JC విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వేదిక, స్టాళ్లు, పార్కింగ్ ఏర్పాట్లు రేపటిలోగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు. కోట వారసత్వం అందరికీ తెలిసేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు.