రీచ్ ఉంది.. ఇసుక లేదు..!

రీచ్ ఉంది.. ఇసుక లేదు..!

WNP: వీపనగండ్ల మండలం తూముకుంట వాగులో ఇసుక రీచ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆన్లైన్ బుకింగ్‌కు మాత్రం అవకాశం కల్పించడం లేదు. నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, ఇళ్లు నిర్మించుకునేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో ఇసుకను అందుబాటులో ఉంచాలని ప్రజలు కలెక్టర్ ఆదర్శ్ సురభిని కోరుతున్నారు.