కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీపీఐ ఎంఎల్ ఆందోళన

WGL: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు నిరసనగా నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సత్య శారదా దేవికి వినతి పత్రం సమర్పించారు.