మహావీరుడు: అహింసా మార్గదర్శి
VZM: 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడి జన్మదిన వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లాలో ఉన్న శ్రీ సంభవనాథ్ జైన్ మందిరంలో మహవీరుడు బోధించిన సత్యం, అహింస, కరుణ వంటి బోధనలను స్మరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహ వీరుడు బోధనలలో అహింస అత్యున్నత ధర్మమని గుర్తు చేసుకున్నారు. నేడు జిల్లాలో ప్రభుత్వం మాంసం అమ్మకాలను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.