నిర్మల్ పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహణ
NRML: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శి నగర్ బస్తీ ఉదాసీమటం మైదానంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందూర్ విభాగ్ ప్రాంత ప్రచారక్ వెంకట శివకుమార్, శివానంద భారతి స్వామి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.