స్వచ్ఛ భారత్ నిధుల మళ్లింపుపై ఫిర్యాదు

స్వచ్ఛ భారత్ నిధుల మళ్లింపుపై ఫిర్యాదు

NGKL: నియోజకవర్గంలోని పెద్ద ముద్దనూరులో స్వచ్ఛ భారత్ నిధుల అక్రమాలపై బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ శ్రీశైలం అదనపు కలెక్టర్‌కు నేడు వినతిపత్రం సమర్పించారు. నిధుల మళ్లింపుపై గతంలో డీపీవోకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.