ఆర్మూర్‌లో 'ఆపరేషన్ చబుత్ర' కార్యక్రమం

ఆర్మూర్‌లో 'ఆపరేషన్ చబుత్ర' కార్యక్రమం

NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్‌లో పోలీసులు బుధవారం అర్ధరాత్రి 'ఆపరేషన్ చబుత్ర' కార్యక్రమం నిర్వహించారు. CI సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు SIలు, సిబ్బందితో కలిసి తనిఖీలు జరిపారు. అర్ధరాత్రి వరకు తిరుగుతున్న పలువురికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వారు తెలిపారు. రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు. అలాగే 3 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 20 వాహనాలకు జరిమానా విధించారు.