అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం
VKB: పూడూరు గేటు సమీపంలోని మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.