విద్యార్థి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

విద్యార్థి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

ATP: బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి అగ్రికల్చర్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.