గోతులమయంగా రోడ్డు.. వాహనదారులకు తప్పని తిప్పలు

గోతులమయంగా రోడ్డు.. వాహనదారులకు తప్పని తిప్పలు

VZM: బాడంగి మండలం డొంకినవలస రోడ్డు గోతులమయంగా మారింది. ఎత్తు బ్రిడ్జి నుంచి డొంకినవలస రైల్వే గేటు వరకు రోడ్డుపై గోతులు ఉండడంతో రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డొంకినవలస, పిండ్రంగివలస, లక్ష్మిపురం, కె.కృష్ణాపురం, ఎస్.బూర్జవలస, డొంకినవలస రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే ఇదే రోడ్డుపై వెళ్లాలి. అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరారు.