'పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లింది'

WGL: పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలంచెల్లిందని, నేడు యువతకు కమ్యూనిజమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నదని సీపీఐ రాష్ట్రసహాయకార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. గురువారం హసన్‌పర్తి మండలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ వ్యవస్థ రోజు రోజుకు సంక్షోభంలో కూరుకుపోతున్నదని, పెట్టుబడిదారీ వ్యవస్థ పతనంతో ప్రపంచ యువత ఎర్రజెండా వైపు చూస్తుందన్నారు.