పేకాట శిబిరంపై పోలీసులు దాడి
ప్రకాశం: పామూరు మండలం వీరభద్రపురం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ఒంగోలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడిని నిర్వహించారు. ఈ సందర్భంగా 5 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.10 వేల నగదు, నాలుగు మోటర్ సైకిల్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పామూరు పోలీస్ స్టేషన్ అప్పగించారు.