నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: మధిర టౌన్ -2 బస్ డిపో ఫీడర్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా బస్ డిపో ఏరియా, శ్రీనగర్ కాలనీ, అగ్రికల్చరల్ ఫారం రోడ్డు, సుందరయ్య నగర్, హనుమాన్ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీ ఏరియాలలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.