పెద్దమల్లారెడ్డి చెరువులో మృతదేహం లభ్యం
KMR: భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. ఫీల్డ్ అసిస్టెంట్ కొండల్ రెడ్డి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల వివరాల ప్రకారం మృతురాలు అదే గ్రామానికి చెందిన దూడ ఎల్లవ్వ (55)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.