'ఔట్ స్కోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి'
SRPT: ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలల నుంచి వేతనాలు రావట్లేదని జిల్లా CITU కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వ జిల్లా వైద్య శాల వద్ద మూడు రోజులుగా దీక్షలు చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దీక్షను సందర్శించి మద్దతు తెలిపారు.