నాన్న సారీ.. అంటూ యువకుడు ఆత్మహత్య

నాన్న సారీ.. అంటూ యువకుడు ఆత్మహత్య

CTR: పెనుమూరు(M) విడిదిపల్లికి చెందిన డి. అరవింద్ (17) ప్రేమ విఫలమై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. తోటి విద్యార్థినితో కలిసి అరవింద్ విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని ఇంటికి తీసుకువచ్చారు. డిప్రెషన్‌కు గురైన అతడు తల్లిదండ్రులకు లేఖ రాసి ఉరేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.