VIDEO: పత్తికి మద్దతు ధర ఇవ్వాలి: మాజీ మంత్రి
WNP: పత్తి పంటకు మద్దతు ధర రూ.8110 ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దమందడి మండలం వెల్టూరు ఎస్.ఎస్.వి కాటన్ మిల్లును ఆయన సందర్శించి పత్తి రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పత్తి పంటసాగు చేసిన రైతులు నష్టపోతున్నారన్నారు.