నేడు బనగానపల్లెలో పర్యటించనున్న మంత్రి

నేడు బనగానపల్లెలో పర్యటించనున్న మంత్రి

NDL: నేడు బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. ఎనకండ్ల గ్రామంలో నూతనంగా నిర్మించబోతున్న ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం కొరకు చేసే భూమి పూజ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని టీడీపీ నాయకుడు మోహన్ రెడ్డి తెలిపారు.