అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
NLG: కనగల్ ఎక్స్ రోడ్డులో రూ.12 లక్షల నిధులతో నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి సర్పంచ్ మురళీధర్ గౌడ్ శంకుస్థాపన చేశారు. అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి నూతన భవనాన్ని సిబ్బందికి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సీపీడీవో, ఉపసర్పంచ్ పాల్గొన్నారు.