VIDEO: మిద్దెపై నుంచి పడి మహిళ మృతి

ప్రకాశం: కొమరోలులోని శ్రీకృష్ణ మందిరం వద్ద స్థానికంగా నివాసం ఉంటున్న గుడిమి సుశీలమ్మ(70) ఈదురుగాలులు వీస్తుండగా ఆరబోసిన పసుపు కొమ్ములను తీసుకురావడానికి మిద్దె పైకి ఎక్కింది. ఆ గాలులకు ఆమె కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.